బస్టాండ్ లేదు.. రోడ్డే దిక్కు!
బస్సుల కోసం రోడ్డుపైన, టీకోట్ల దగ్గర నిరీక్షణ
మాగనూరు సెప్టెంబర్ 23(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మాగనూరు కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డు పక్కన, హోటల్, వద్ద కిరాణా దుకాణాల, వద్ద రోడ్డుపై ఎండనక,వాననక,నిరీక్షిస్తూ బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు.బస్టాండ్ లేకపోవడంతో బస్సులు ఎక్కి, దిగే, దుస్థితి నెలకొందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మాగనూరు మండలం చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి ఆయా గ్రామ ప్రజలు ప్రతిరోజు మక్తల్,మహబూబ్నగర్,నారాయణపేట,కర్ణాటకలోని రైచూర్ జిల్లా కేంద్రాలకు పనుల నిమిత్తం వెళుతూ వస్తుంటారు.అయితే మండల కేంద్రానికి వచ్చిన ప్రయాణికులకు కూర్చోవడానికి బస్టాండ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
కొత్తగా వచ్చే వారు మండల కేంద్రంలో ఎక్కడ దిగాలో తెలియక అయోమయంలో పడుతున్నారు.167వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండల కేంద్రంలో ఉన్న బస్టాండు స్థలంలో నిర్మించకుండా బస్సులు ఆగని స్థలంలో చిన్న బస్టాండు జాతీయ రహదారి వారు ఏర్పాటు చేయడం జరిగినది.బస్సులు మాత్రం మండల కేంద్రంలోని ఆగుతున్నాయి.ఆర్టీసీ,ఆర్ అండ్ బి,అధికారులు స్పందించి గతంలో మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ స్థలంలో డబ్బాలు వెలసినాయి. డబ్బాలను తొలగించి మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని మండలం ప్రజలు కోరుతున్నారు