రాగద్వేషాలు, ప్రతీకార చర్యలు వ్యర్థం

24-10-2026 | 08:40pm

కేసుల బారిన పడకుండా మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలి

సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి

భూపాలపల్లి,(విజయక్రాంతి): వ్యక్తిగత రాగద్వేషాలకు లోనై ప్రతీకార చర్యలకు పాల్పడటం, కేసుల బారిన పడి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం లేదని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి(Senior Civil Judge Thadooru Mahathi Vaishnavi) అన్నారు.

శనివారం ట్రైనింగ్ పొందిన మధ్యవర్తులు, కమ్యూనిటీ మధ్యవర్తులు, పారా లీగల్ వాలంటీర్లతో(Para-legal volunteers) నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి, ఇరుపక్షాలు కూర్చుని చర్చించుకోవడం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చనే విషయంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

చిన్నారులకు సురక్షిత బాల్యాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.ఈ

కార్యక్రమంలో ట్రైనింగ్ పొందిన మధ్యవర్తులు పీ. ఆనందరావు, కనపర్తి కవిత, ఎస్. రవీందర్, మంగళపల్లి రాజ్‌కుమార్, ఇందరపు శివకుమార్, ఎల్. విష్ణు, ఏ. రవికుమార్, అంబాలా ఆనందం, రాజమౌళి, రాజ్‌కిరణ్, పారా లీగల్ వాలంటీర్లు శ్రీనివాస్, రజని, సందీప్‌రాజ్, కిరణ్, అంజయ్య, లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు