భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేత
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నాగుపల్లి గ్రామంలో రైతులకు పరిహారం పంపిణీ
దమ్మపేట, అక్టోబర్ 24, (విజయక్రాంతి): దమ్మపేట మండలం(Dammapeta Mandal) నాగుపల్లి గ్రామంలో సీతారామ ఎత్తిపోతల పథకం(Sitarama Lift Irrigation Scheme) సత్తుపల్లి ట్రంక్ కెనాల్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార మార్కెటింగ్ శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao), అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం చెక్కులను శనివారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.