నాగుపల్లిలో సీతారామ ప్రాజెక్ట్ పనుల పరిశీలన

24-10-2026 | 08:40pm

నవంబర్ రెండో వారంలో సత్తుపల్లి, వేంసూరు మండలాలకు గోదావరి జలాలు 

దమ్మపేట, అక్టోబర్ 24(విజయక్రాంతి): దమ్మపేట మండల(Dammapeta Mandal) పరిధిలోని నాగుపల్లి లో సత్తుపల్లి ట్రంకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్(Sattupalli Trunk Sita Rama Lift Irrigation) పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం  అశ్వారావు పేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణతో కలిసి భూ నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ వచ్చేనెల నవంబర్ రెండవ వారంలో ఈ కాలువ ద్వారా గోదావరి జలాలను బేతుపల్లి చెరువు ద్వారా ఎన్టీఆర్ కెనాల్ నుండి వేంసూరు మండలాలకు నీరు అందిస్తామని, మిగిలిన పనులు కూడా అతి త్వరలో పూర్తి చేసి అశ్వారావుపేట నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాలకు కూడా గోదావరి జలాలను అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ కాలువలకు భూమి ఇచ్చిన ప్రతి రైతుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు ఇరిగేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు