మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ

12-09-2026 | 08:18pm

– సింగరేణి మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామ్‌చంద్ర

మణుగూరు,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి మణుగూరు ఏరియా(Singareni Manuguru Area) ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ(Distribution of clay Ganesha idols) చేయనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ్‌చంద్ర తెలిపారు. వినాయక చవితి(Vinayaka Chavithi ) పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణానికి హాని కలిగించని విధంగా 12 అంగుళాల మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్ణయించిన ప్రదేశాల్లో విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని జీఎం రామ్‌చంద్ర కోరారు. పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు