విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం.
రాజాపూర్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్(LV Prasad Eye Hospital) వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరం(Free eye medical camp) విజయవంతమైందని గ్రామ సర్పంచ్ సంతోష్ వెంకటేష్ తెలిపారు. ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ కంటి వైద్యులు డాక్టర్ వంశీ, సుకన్య కంటి సమస్యలు ఉన్న ఉన్న 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు చేసి అవసరమువారికి ఉన్న వారికి ఆపరేషన్ ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. అలాగే కంటి సమస్యలు ఉన్నవారికి అద్దాలు మందులు ఉచితంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ రామ్ చందర్, డీసీసీ ఉపధ్యక్షులు యాదయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,వార్డ్ సభ్యులు రహిమత్ పాషా, చంద్రయ్య, లింగం, చంద్రయ్య,సత్యం,నర్సిములు, నర్సిములు అంజయ్య, నర్సిములు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.