వారి కోయలు తగలబెట్టోద్దు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య
కూసుమంచి, నవంబర్ 27(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని(Kusumanchi Mandal) కొత్తూరు గ్రామంలో వరి కొయ్యలను(Paddy stubble) తగలబెడుతున్న వ్యవసాయ క్షేత్రాన్ని(Agricultural field) జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికొయ్యలను(Paddy stubble) తగలబెట్టడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం(Organic carbon) కూడా దెబ్బతింటుందని తెలియజేశారు.
వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి యొక్క భౌతిక స్థితి కూడా దెబ్బతింటుందని తెలిపారు. పంట అవశేషాలు తగలబెట్టకుండ భూమిలో కలియదున్నాలని, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నేల గుళ్ళబారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ ఆత్మ సరిత, కూసుమంచి డివిజన్ ఏడీఏ రాజేష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓ రఘు రైతులు పాల్గొన్నారు.