ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

13-11-2026 | 11:23pm

జాతీయ ప్రయోజనాలే రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యం – డా. పెసరు విజయచంద్ర రెడ్డి

కొత్తగూడెం: టౌన్ నవంబర్ 13 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ప్రేక్షకుల్లా చూస్తూ మౌనంగా ఉండటం పౌరుల బాధ్యత కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను(Democratic system), రాజ్యాంగ విలువలను(Constitutional values), దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై  డెమోక్రసీ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది కాసాని రమేష్(Advocate Kasani Ramesh) గారి అధ్యక్షతన జరిగిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం-అరాచక శక్తులను తరిమికొడదాం అను నినాదంతో జరిగిన మేధావుల సంగోస్టి కార్యక్రమంలో దక్షిణ భారత ఆర్థోపెడిక్ అసోసియేషన్(South Indian Orthopaedic Association) అధ్యక్షులు, ఈ సందర్భంగా డా. విజయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదని, నిరంతరం ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వాల జవాబుదారీతనం, స్వేచ్ఛాయుత చర్చలు, రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగడమే నిజమైన ప్రజాస్వామ్యమని వివరించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ జాతీయవాదం అనేది కేవలం రాజకీయ నినాదం కాదని, దేశం పట్ల ప్రేమ, బాధ్యత, అంకితభావం, జాతీయ ఐక్యతకు కట్టుబడి ఉండటమే నిజమైన జాతీయవాదమని అన్నారు. భారతదేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలను కలిపి ఉంచేది భారతీయత అనే భావన అని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి SIR గురించి తప్పుడు ప్రచారం చేస్తుందని sir వలన భారతదేశంలో నిజమైన పౌరుల ఓటు ఎవరిది పోలోదని  కేవలం అక్రమ వలసదారుల ఓట్లు మరణించిన వారి ఓట్లు ఒక వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల రెండు ఓట్లు ఉంటే అటు ఓట్లు మాత్రమే ఎన్నికల కమిషన్ తొలగించిందే తప్ప నిజమైన పౌరుడు యొక్క ఓటు తొలగించలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇండియా కూటమి అక్రమ వలసదారులు కూడా ఓటు ఇవ్వాలి అని అనడం హాస్యస్పదమని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జీవీకే మనోహర్  BJP  జిల్లా మాజీ అధ్యక్షులు కె.వి రంగా కిరణ్ ,రిటైర్డ్ ఉపాధ్యాయులు పార్థసారథి, నేషనల్ డస్ట్ ప్రివెన్షన్ కమిటీ సభ్యులు పి. మాధవ్ నాయక్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, కార్మిక సంఘాల నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు