ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్‌కు పరామర్శ
పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసనసభ్యులు.
మహమ్మదాబాద్,నవంబర్ 13 విజయక్రాంతి : మండలంలోని మంగంపేట్ మాజీ సర్పంచ్ గీత పాండు(Former Sarpanch Geetha Pandu) ఇటీవల 12 రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో(Car accident) తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, ప్రమాదంలో ఇద్దరికి చేతులకు ఫ్రాక్చర్లు కావడంతో వారిని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి(Former MLA Koppula Maheshwar Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం, వారి పెళ్లి రోజు కావడంతో. గీత పాండు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహమ్మదాబాద్ మండల అధ్యక్షుడు దిడ్డికాడి గోపాల్, సీనియర్ నాయకులు రాంరెడ్డి తిరుమల్ రెడ్డి, గొల్ల వెంకన్న, కేశవులు,అశోక్ గౌడ్, మంగంపేట్ తండా నాయకులు గోపాల్ నాయక్, కారోబార్ గోపాల్, అంబ్రియ, సభావత్ హరి నాయక్, చిన్నాయిపల్లి బీఆర్ఎస్ యువత హాజీ మల్లేష్, తండా కారోబారి గోబ్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు.