మాజీ జడ్పీటీసీ ఆకుల సిద్దిరాములు మృతి

13-11-2026 | 11:17pm

పలువురు రాజకీయ ప్రముఖుల నివాళులు

చేగుంట నవంబర్ 14,విజయక్రాంతి : చేగుంట మాజీ సర్పంచ్, జడ్పీటీసీ ఆకుల సిద్దిరాములు(Akula Siddiramulu, former Sarpanch and ZPTC member of Chegunta) మృతి చెందడం పట్ల వివిధ రాజకీయ పార్టీలకు(political parties) చెందిన సీనియర్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆకుల సిద్దిరాములు ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి చేగుంట ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు