భూముల రీ సర్వే పై అవగాహన

13-11-2026 | 11:01pm

హాజరైన రెవిన్యూ డివిజన్ అధికారి 

ముస్తాబాద్,నవంబర్ 13(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో(Rythu Vedika) రీ-సర్వేపై(Re-Survey) సమన్వయ సమావేశం నిర్వహించి రైతులకు(Farmers) అవగాహన కల్పించారు.రీ.సర్వే బృందాలకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని సర్పంచులు హామీ ఇచ్చారు. మొర్రాపూర్, గూడూరు గ్రామాల్లో కొనసాగుతున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ డివిజనల్(Revenue Divisional) అధికారి శ్రీధర్ బాబు అధ్యక్షతన శుక్రవారం ముస్తాబాద్ రైతు వేదికలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ-సర్వే కార్యక్రమం ద్వారా భూ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి,రైతులకు సంబంధించిన భూ రికార్డులలో పారదర్శకత  ఖచ్చితత్వం సాధించేందుకు రైతులందరూ సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.సర్వే బృందం ఎలాంటి అవకతవకలు లేకుండా సర్వే చేపట్టేందుకు సహకరించాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమంలో సర్వే జరుగుతున్న మొర్రాపూర్ గూడూరు గ్రామాల సర్పంచులు సునీతా నర్సింగరావు, భూక్య రాజు ఎంపీడీఓ లచ్చాలు,తహసీల్దార్ ఫారుక్,డియో సర్వేయర్, వ్యవసాయ అధికారి అనూష వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, రీ-సర్వే బృందం సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు