బంగాళాఖాతంలో అల్పపీడనం

13-11-2026 | 09:43am

ఏపీకి తుఫాన్ టెన్షన్!

విశాఖపట్నం: బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం మారుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఇది క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు ఉండటంతో తీరప్రాంత రాష్ట్రాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

48 గంటల్లో మరింత బలపడే ఛాన్స్!

తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 14 నాటికి Well Marked Low Pressure Areaగా, నవంబర్ 15 నాటికి Depressionగా బలపడే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవస్థ మరింత తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారుతుందా? ఏ దిశగా ప్రయాణిస్తుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తుఫాన్ ఏర్పడినట్లు అధికారిక ప్రకటన లేదు.

కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందా?

ఈ వాతావరణ వ్యవస్థ దిశ, తీవ్రతను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో వాతావరణ మార్పులపై అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నవంబర్ 14 నుంచి 17 వరకు సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

తుఫాన్‌పై ఉత్కంఠ.. తదుపరి అప్‌డేట్ కీలకం!

ఇప్పటికే వరుస తుఫాన్ల ప్రభావాన్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు ఈ కొత్త Weather System మరోసారి ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతానికి భారీ వర్షాలు లేదా తుఫాన్ ప్రభావంపై ఖచ్చితమైన అంచనాలు వెలువడలేదు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత దాని Track, Intensity ఆధారంగా ఏయే ప్రాంతాలపై ప్రభావం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజలు, ముఖ్యంగా తీరప్రాంతాల వారు IMD, విపత్తు నిర్వహణ శాఖ తాజా సూచనలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు