చంద్రకల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
13-11-2026 | 11:20pm
వివిధ వేషధారణల్లో ఆకట్టుకున్న విద్యార్థులు
నాగర్ కర్నూల్ ( విజయక్రాంతి ) : పెద్దకొత్తపల్లి మండలం(Peddakottapalli Mandal) చంద్రకల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో(Chandrakal Mandal Parishad Primary School) శుక్రవారం బాలల దినోత్సవ(Childrens Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆటపాటలు, ఉత్సాహభరిత ప్రదర్శనలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్. సురేందర్ గౌడ్, ఉపాధ్యాయులు ఎస్. ఆంజనేయులు, డి. విమల, జి. చైతన్య, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఎం. ప్రశాంతి పాల్గొన్నారు.