వాహనాల తనిఖీల్లో 49 మందిపై కేసులు నమోదు

13-11-2026 | 11:15pm

49 కేసులు...

రూ. 4.30లక్షల జరిమానా

ఆరుగురికి జైలు శిక్ష

సిద్దిపేట క్రైం, నవంబర్ 13 : సిద్దిపేట పట్టణ(Siddipet town) పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తృతంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో(Vehicle inspection) 49 మందిపై కేసులు నమోదయ్యాయని(Cases registered) పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు తన సిబ్బందితో కలిసి చేపట్టిన వాహన తనిఖీల్లో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్, ఏడుగురిపై వితౌట్ లైసెన్స్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల నుంచి వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచామని తెలిపారు.

న్యాయమూర్తి  విచారణ జరిపి మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందికి కలిపి రూ. 3లక్షల 95వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు. వారిలో ఇద్దరికి 5 రోజులు, ముగ్గురికి 3 రోజులు, ఒకరికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సీపీ వెల్లడించారు.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఏడుగురికి రూ. 35వేలు జరిమానా విధించారని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు