ఐఎండ్ పిఆర్ అడిషనల్ డైరెక్టర్ జగన్ కు ప్రెస్ క్లబ్ లో సన్మానం

09-10-2026 | 08:25pm

హనుమకొండ, అక్టోబర్ 9(విజయక్రాంతి): సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్(DS Jagan), జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్(Greater Warangal Press Club) కమిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మానించారు. ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ గా భాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వరంగల్ విచ్చేసిన డీఎస్ జగన్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు శాలువాతో ఘనంగా సన్మానించారు.

వారి తో పాటు ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నేకంటి వెంకటరమణ, పూర్వ డీపీఆర్వో మనోహరాచారి, వరంగల్ జిల్లా డీపీఆర్వో ప్రేమలత, ఖమ్మం డీపీఆర్వో గౌస్ పాషా, రిటైర్డ్ ఉద్యోగి విధుమౌళి లను ప్రెస్ క్లబ్ వచ్చిన సందర్భంగా శాలువా కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేసిన సేవలను ఈ సందర్భంగా  కొనియాడారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, ఈసీ మెంబర్లు నయీంపాషా, అంజి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు