తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

09-10-2026 | 08:32pm

సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ

వెంకటాపూర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు(culture and traditions) బతుకమ్మ పండుగ(Bathukamma Festival) ప్రతీకగా నిలుస్తుందని స్థానిక సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ(Sarpanch Mamidishetti Suguna) అన్నారు. మండల కేంద్రంలోని జోహార్ హై స్కూల్(Johar High School) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని, ఈ వేడుకలు మహిళల్లో ఐక్యత, ఆనందాన్ని పెంపొందిస్తాయని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలియజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు మన సంస్కృతిని అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హమీదా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు