అశ్వాపురం విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

09-10-2026 | 08:28pm

అశ్వాపురం, అక్టోబర్ 9 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని(Ashwapuram Mandal) రవీంద్ర పబ్లిక్ స్కూల్(Ravindra Public School), ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College), ఎక్సలెంట్ ఈఎం పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ, దసరా వేడుకలను(Bathukamma and Dasara celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఎక్సలెంట్ పాఠశాలలో కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా రవీంద్ర పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ దొడ్డ రమేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. శేషుబాబు, ఎక్సలెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ లెనిన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలతో విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల గౌరవం, నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు