భవన నిర్మాణ కార్మికులు సంఘటితం కావాలి
01-10-2026 | 03:33pm
ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు డి. ప్రసాద్
టేకులపల్లి, (విజయక్రాంతి): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు సంఘటితమై తమ హక్కులు, సౌకర్యాల కోసం ఉద్యమించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు(IFTU State Leader) డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆత్మకూరి శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా పని బంద్ పాటించాలని సూచించారు. నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. సంఘ అభివృద్ధికి కార్మికులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ధనసరి నరేష్, అలేం రాజు, కళ్యాణ్, రవీందర్, ఇస్లావత్ నామ గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.