ఘనంగా 108 ఉద్యోగి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

01-10-2026 | 03:55pm

హుజురాబాద్, అక్టోబర్1: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో 108 అంబులెన్స్ పైలెట్‌గా విధులు నిర్వహించిన కాజా ఖలీల్ ఉల్లా(Kaja Khaleel Ullah) పదవీ విరమణ పొందిన సందర్భంగా తోటి ఉద్యోగులు, మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని గురువారం  శంకరపట్నం 108 కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, కరీంనగర్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా భూమా నాగేందర్ మాట్లాడుతూ.. ఖలీల్ ఉల్లా తన సర్వీస్ కాలంలో ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని కొనియాడారు. సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఖలీల్ అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఖలీల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

అనంతరం పదవీ విరమణ పొందిన కాజా ఖలీల్ ఉల్లా మాట్లాడుతూ.. తన ఉద్యోగ ప్రయాణంలో సహకరించిన పై అధికారులు, తోటి సిబ్బంది, మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఖలీల్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆయన శేష జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా సాగాలని తోటి ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలట్లు గోపికృష్ణ, సదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజేందర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు