ఏరియా జి. ఎం కార్యాలయములో ఐలమ్మ జయంతి వేడుకలు

26-09-2026 | 11:27pm

కొత్తగూడెం సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి) : సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం(Office of the General Manager, Singareni Kothagudem Area) శనివారం రోజున, వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిదిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ  హాజరయ్యారు. చాకలి ఐలమ్మ చిత్ర పటానికి  పూలమాలతో నివాళులు అర్పించారు. 

అనంతరం  జిఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఆత్మగౌరవాని కి ప్రతికగా ఆమె  చేసిన సేవలను, ధైర్య సాహసాలను  కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం,ఏఐటియూసి బ్రాంచ్ సెక్రటరీ జె గట్టయ్య, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, ఎస్ఓటు జిఎం ఎం.గోవిందరావు  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు