చాకలి ఐలమ్మ నేటి మహిళలకు స్ఫూర్తిదాయిని
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక.. మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్
దోమకొండ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను(Birth Anniversary Celebration) దోమకొండ మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్(Former Domakonda ZPTC member Teegala Thirumala Goud) మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నాటి రజాకారులు, దొరల అరాచకాలకు ఎదురొడ్డి ధైర్యంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు.
ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి నేటి మహిళలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు