ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య, సౌకర్యాల
గ్రామ సర్పంచ్ బానోతు అరుణ రమేష్ నాయక్
గరిడేపల్లి, సెప్టెంబర్ 26,(విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల్లోనే(Government school) విద్యార్థులకు నాణ్యమైన విద్య(Quality education) అందుతుందని గారకుంటతండ గ్రామ సర్పంచ్ బాణోతు అరుణ రమేష్ నాయక్(Garakunta Thanda Village Sarpanch Banothu Aruna Ramesh Naik) అన్నారు. శనివారం గారకుంటతండ ప్రాథమిక పాఠశాలలో(Garakuntathanda Primary School) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాం దుస్తులను గ్రామ పెద్దలతో కలిసి ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను వ్యాపారంగా మార్చి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో గరిడేపల్లి మాజీ సర్పంచ్ బాణోతు సైదానాయక్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సురభి సైదులు, ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, వీఓఏ సుధాకర్, నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.