సత్వర కేసుల పరిష్కారం
27-09-2026 | 12:09am
నిర్మల్ సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి) : నిర్మల్ కోర్టుల(Nirmal Courts) పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి సత్వరం కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి(District Principal Judge Srivani) అన్నారు. శనివారం కోట ఆవరణలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్న కేసుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి పి రవీందర్ న్యాయవాదులు పాల్గొన్నారు.