పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం
రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ
కొత్తగూడెం అక్టోబర్ 30 విజయక్రాంతి: పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల(Police Commemoration Day) కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో, డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో, మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్(District SP Rohit Raju, IPS) హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. అనంతరం సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ, వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలతో పాటు అన్ని సబ్ డివిజన్ల పరిధిలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, వివరిస్తూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రక్తదానం చేయడం సమాజానికి అందించే గొప్ప సేవ అని పేర్కొన్నారు.ఈ మెగా రక్తదాన శిబిరంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం వారికి పండ్లు, పండ్ల రసాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎంహెచ్ఓ తుకారం నాయక్, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, జితేందర్, యాసిన్, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, నరేష్, ఆర్ఐలు రవి, లాల్బాబు, కృష్ణారావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.