పీ ఆర్ సీ వేతన బకాయిలను వెంటనే ఇవ్వాలని

30-10-2026 | 03:55pm

బోధన్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): కట్ చేసిన  పీఎఫ్ ఈఎస్ఐ లను కార్మికుల ఎకౌంట్లో జమ చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లను ఇవ్వాలని మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ  తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(Telangana Progressive Municipal Workers Union)  (టీ యూ సీ ఐ ) ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ర్యాలీ.

ధర్నా శుక్రవారం నాడు తెలంగాణ ప్రతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీ యూ సీ ఐ) ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ మరియు డైలీ వైస్ కార్మికులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏవో గారికి ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీ యూ సీ ఐ ) రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఒక వైపు పొగుడుతూనే పారిశుధ్య రంగంలో ఇటువంటి పని ఎవ్వరు చేయరని కొనియాడుతూ మరొకవైపు వారికి ఇవ్వాల్సినటు వంటి పి.ఆర్.సి బకాయిలను బోధన్ మున్సిపల్ అధికారులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని తీవ్రంగా తీయబట్టారు.

దేవుడు కరుణించినా పూజారి కనికరించినట్లు 2021 లోనే ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ  ఇప్పటివరకు కార్మికులకు ఇవ్వాల్సిన పిఆర్సి బకాయిల ను ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇదే కాకుండా ప్రతి నెల నెలా కార్మికుల వేతనాల నుండి కట్ చేసినటువంటి పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను కార్మికుల ఎకౌంట్లో వెంటనే జమ చేయకుండా నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారని దీని మూలంగా కార్మికులకు రావలసిన ప్రయోజనాలు పొందలేక పోతున్నారని వారి నిర్లక్ష్యం మూలంగా మరణించినటువంటి వారికి గాని ఏదైనా ప్రమాదాలకు గురైనటువంటి వారికి గాని ఇన్సూరెన్స్ లాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఈఎస్ఐ  ప్రతి నెల ఒక్కొక్కరి నుండి 1000 నుండి 1500 రూపాయల వరకు కట్ అవుతున్నప్పటికీ ఈఎస్ఐ ఆసుపత్రి నిజామాబాదులో ఉన్నందున అక్కడికి వెళ్లి చూయించుకోలేక పోతున్నారని దాన్ని బోధన్ జనరల్ ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేసే ఈ ఎస్ ఐ వైద్య సేవలను అందే విధంగా చేయాలని కోరారు.

అట్లాగే పారిశుధ్య రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పనిముట్లు ఇవ్వకపోవడంతో కార్మికుల వారి సొంత డబ్బులుతో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని అట్లాగే కార్మికులకు గ్లౌజులు, మాస్కులు,  లాంటివి కూడా ఇవ్వకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పులు బట్టలు నూనె  వీటిని వెంటనే కార్మికులకు ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ సమస్యలను పరిష్కారం చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్  మున్సిపల్ కార్మిక నాయకులు బి. పర్వయ్య, కే. గంగమని, జి. రాజు, బి. గంగారాం, లావణ్య, కృష్ణ, ప్రభాస్, పోశెట్టి, జి. రాజు, షేక్ బాబు, కళావతి, తుక్కాబాయి, గంగమని, పరమేష్ తదితరుల తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు