ప్రతి ఇంటికీ 'ఇందిరమ్మ బీమా' భరోసా!

20-11-2026 | 05:27pm

ఎం ఎల్ ఏ జారే 

నాగుపల్లిలో అశ్వారావుపేట నియోజకవర్గ తొలి నమోదు కార్యక్రమం ప్రారంభం

దమ్మపేట, నవంబర్ 20(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం(Indiramma Family Insurance Scheme) అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(Ashwaraopeta MLA Jare Adinarayana) సూచించారు. ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi's Birth Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో(Ashwaraopeta Constituency) తొలి నమోదు కార్యక్రమాన్ని దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గ్రామానికి చెందిన చిలకా లక్ష్మీదేవి పేరుతో తొలి ఆన్‌లైన్ నమోదును స్వయంగా ప్రారంభించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఎవరూ మిగిలిపోకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పథకం వివరాలను తెలియజేసి నమోదు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, పి సి సి జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సత్యప్రసాద్, ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, తహశీల్దార్ (యు/టి డిప్యూటీ కలెక్టర్)మద్దినేని మురళీ, ఎ డి ఎ రవికుమార్, స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు, కుంపటి వేణు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు