సర్పంచుల మనోభావాలను గౌరవించాలి

20-11-2026 | 05:31pm

జుక్కల్, నవంబర్ 20 (విజయక్రాంతి) : జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో(Jukkal MLA Camp Office) గత రెండు రోజుల క్రితం ఇందిరమ్మ పెన్షన్ల(Indiramma Pensions) మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. గ్రామానికి ఒకరికి చొప్పున ఇందిరమ్మ పెన్షన్ మంజూరి పత్రాలు పంపిణీ(Distribution of approval documents) చేశారు. అధికార పార్టీ చెందిన గ్రామ సర్పంచ్‌లు హాజరయ్యారు. హాజరుకాని సర్పంచులకు వారి స్థానంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు(Village Congress party workers) అధికారుల ద్వారా మంజూరైన పత్రాలను అందించారని, ప్రోటోకాల్(Protocol) పాటించలేదని మండలంలోని పెద్ద ఏడ్గి, గుండూర్, లాడెగాం, పడంపల్లి, చిన్న ఏడ్గి గ్రామాలకు చెందిన సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అన్యాయంపై స్పందించిన కొంతమంది సర్పంచ్‌లు ఎంపీడీవో కార్యాలయానికి(MPDO Office) వచ్చి తమ అసంతృప్తి తెలిపారు. ప్రోటోకాల్‌ను గౌరవించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరినీ సమానంగా చూసే విధంగా అధికారులు వ్యవహరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారుల, ప్రజా ప్రతినిధుల స్పందన కోసం సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. 

ఈ విషయంపై టిఆర్పి నాయకుల ఖండన :

ఇదే విషయంపై టిఆర్పి నియోజకవర్గ అధ్యక్షుడు ఖండేరావు స్పందించి మాట్లాడారు. అధికారంలో ఉన్నామని అహంకారంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని గ్రామాల్లో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని,  ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇవ్వాల్సిన పెన్షన్ల మంజూరు పత్రాలు ఇంటింటికి తిరిగి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

పెద్ద ఏడ్గి గ్రామంలో సర్పంచ్ కు కాదని కార్యకర్తలే మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడం, వారి మనోభావాలు దెబ్బతినేలా చేయడం  పట్ల ఆయన తప్పు పట్టారు. ఇందులో పెద్ద ఏడ్గి సర్పంచ్ అనిల్, పంచాయతీ పాలకవర్గం, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు