గ్రంథాలయాలతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
మహబూబాబాద్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో(District Central Library) 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు(National Library Week Celebrations) ఈనెల 14 నుంచి 20 తేది వరకు ఘనంగా నిర్వహించి శుక్రవారం ముగింపు వేడుకలు, బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్(Municipal Chairperson Guguloth Jyothi Ramesh Naik), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలతో నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు(Students'), నిరుద్యోగులకు(Unemployed), గ్రంథాలయాలతో ఎంతో బంగారు భవిష్యత్తు అని అన్నారు.
గ్రంథాలయాలలో అధ్యాయానికి నిత్యం కొంత సమయం కేటాయించి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కావున విద్యార్థిని, విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని అన్ని రంగాల్లో రాణించి ఉన్నంత శిఖరాలను అధిరోహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తూర్పాటి శ్రీలత, లైబ్రేరియన్స్ జి .విజేందర్, రుద్రారపు వీరేందర్, సిబ్బంది బొడ్డుపల్లి భూలక్ష్మి. బి. యాదమ్మ, సీనియర్ నాయకులు నర్సింగా శ్రీనివాస్, సీనియర్ పాఠకుడు, పుస్తక ప్రియుడు అబ్బ గాని భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు రాచకొండ ఉపేందర్, గాడిపల్లి ప్రవీణ్, జి.అనూజ, ప్రవీణ్, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.