దీక్షా దివస్ వేదికను పరిశీలించిన రేగా

20-11-2026 | 06:00pm

మణుగూరు, నవంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా అప్పటి టీఆర్ఎస్ అధినేత(TRS chief), ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్(BRS leader KCR) ఆమరణ నిరాహార దీక్ష(Indefinite hunger strike) చేపట్టిన నవంబర్ 29వ తేదీని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని(BRS Party Initiation Day Program) నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న మణుగూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి(Initiation Day Program) సంబంధించిన వేదిక ఏర్పాట్లపై బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జి, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Former Pinapaka MLA Rega Kantha Rao) శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు.

కార్యక్రమం నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు.దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు