ఒకేషనల్ కోర్సులతో విద్యార్థుల ఉపాధి అవకాశాలు
మహబూబాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో(Competitive World) కేవలం విద్యార్హతలు(Educational Qualifications) మాత్రమే కాకుండా, వృత్తి నైపుణ్యాలు(Professional Skills) కూడా ఎంతో అవసరమని మహబూబాబాద్ జిల్లా ఇంటర్మీడియట్(Mahabubabad District Intermediate) విద్యాధికారి ఎన్.విజయ కుమారి తెలిపారు. ఇంటర్మీడియట్ స్థాయిలో అందిస్తున్న ఒకేషనల్ కోర్సుల(Vocational courses) ద్వారా విద్యార్థులు చదువుతో(Education) పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థుల ఓజేటి (ఆన్ ద జాబ్ ట్రైనింగ్) సెంటర్లను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం తో పాటుగా డి ఐ ఈ ఓ ఎన్ విజయ కుమారి బుధవారం సందర్శించారు.
ఎం పి హెచ్ డబ్ల్యు కోర్సుల ద్వారా విద్యార్థినులకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం, ప్రాథమిక వైద్య సేవలు, ప్రథమ చికిత్స, మాతా శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, వ్యాధుల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను పొందేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు.
ఓ ఏ కోర్సు ద్వారా విద్యార్థులు కార్యాలయ నిర్వహణ, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్, డేటా ఎంట్రీ, ఫైళ్ల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కార్యాలయ విధివిధానాలపై శిక్షణ పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కార్యాలయ సహాయకులుగా పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చునని విద్యార్థులు ప్రతి అవకాశం అంది పుచ్చుకోవాలన్నారు.