లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వార్డు ఆఫీసర్

20-11-2026 | 04:11pm

మేడ్చల్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి (Corruption) అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఏసీబీ అధికారులు (ACB Officials) దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.30 వేల లంచం (Bribe) తీసుకుంటూ వార్డు ఆఫీసర్ రవీంద్ర పట్టుబడ్డారు.

అసెస్మెంట్ పనిని పూర్తి చేసేందుకు రవీంద్ర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ కార్యాలయంలోనే అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ (Investigation) చేపట్టారు. అవినీతి వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు