అమ్మ దీవెన ఉంటే.. ప్రతి అడుగులో శుభమే

11-10-2026 | 03:22pm

టేకులపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): శ్రీ దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా స్వగ్రామమైన టేకులపల్లి మండలం కోయగూడెంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కోయగూడెం సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్ పాల్గొని పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు