డిమాండ్ కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ
- సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు
- నాణ్యమైన విద్యుత్ కు కృషి
- మంచిర్యాల ఎస్ ఈ రాజన్న
మంచిర్యాల, (విజయక్రాంతి) : రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) మంచిర్యాల సర్కిల్(Mancherial Circle) పరిధిలో రెండున్నరేళ్లుగా విద్యుత్ అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. భవిష్యత్‌లో పెరిగే విద్యుత్ లోడ్‌ను(Electrical load) అధికారులు ముందుగానే అంచనా వేసి రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల(Power transformers) సామర్థ్యాన్ని 5 MVA to 8 MVAకు పెంపు, మరో రెండు 5 MVA అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, 32 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాల పెంపు, 16 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేసి విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు.
కొత్త సబ్‌స్టేషన్లతో పెరిగిన విద్యుత్ సరఫరా సామర్థ్యం...
కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే ఉన్న సబ్‌స్టేషన్లపై అధికంగా ఉన్న లోడ్‌ను విభజించి, ఓవర్ లోడింగ్ సమస్యలను నియంత్రించేందుకు విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నర్సింగాపూర్ గ్రామంలో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి తగ్గడంతో పాటు సంబంధిత ప్రాంతాల్లో వోల్టేజ్ స్థాయిలు మెరుగుపడి ప్రస్తుత విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్‌లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా సంబంధిత శాఖ అధికారులు సరఫరా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు.
విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ మరింత బలోపేతం - బీ రాజన్న, సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) మంచిర్యాల సర్కిల్.
విద్యుత్ వినియోగం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో రబీ, వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎన్‌పీడీసీఎల్ పంపిణీ నెట్‌వర్క్‌ను ముందస్తుగా బలోపేతం చేస్తున్నాం. ప్రస్తుత విద్యుత్ లోడ్‌ను తీర్చడమే కాకుండా పెరిగే విద్యుత్ డిమాండ్‌ను కూడా సమర్థవంతంగా నిర్వహించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. వినియోగదారులకు మెరుగైన వోల్టేజ్‌తో పాటు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ నిరంతరం విద్యుత్ అభివృధి పనులు పడుతుంది.