మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తా
బోథ్, అక్టోబర్ 11 ( విజయక్రాంతి): మైనారిటీ ల సంక్షేమం(Welfare of Minorities) కోసం తన వంతు కృషి చేస్తానని సునాల మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం(Shaik Ibrahim) పేర్కొన్నారు. ఆదివారం నూతనంగా నియమితులైన తీయనను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) మైనారిటీలకు అందే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి లోలపు పోశెట్టి(DCC Secretary Lolapu Poshetti), చౌహన్ హరి సింగ్, సోనాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు చౌహన్ వినోద్ సింగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూంగాల భోజన్న, మాజీ సర్పంచ్ సోయం బాపూరావు, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ,చౌహన్ సురేందర్,, ఆత్రం గోవిందరావు, తులసిరామ్ సోనీరావు,పాండురంగ ,అంకుష్, తదితరులు పాల్గొన్నారు