దుర్గామాత దీక్షా వైభవం.. వెయ్యి మందితో మాలధారణ
11-10-2026 | 03:39pm
నిర్మల్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆలయ వ్యవస్థాపకుడు వెంకటాచారి ఆధ్వర్యంలో దుర్గామాత దీక్షా మాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది భక్తులు మాలధారణ(Deeksha Mala Dharana) చేశారు.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు వెంకటాచారి మాట్లాడుతూ.. ప్రజలందరూ దుర్గా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, అమ్మవారి అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు