ఆపదలో అండగా నిలిచిన స్నేహబంధం!

11-10-2026 | 04:11pm

మిత్రుడి కుటుంబానికి 2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ₹45 వేల ఆర్థిక సాయం 

మిడ్జిల్, అక్టోబర్(విజయక్రాంతి) 11: వాడియాల్ గ్రామానికి(Vadiyal Village) చెందిన మహమ్మద్ ఉమర్ పాషా(Mohammed Umar Pasha) (38) బ్రెయిన్ స్ట్రోక్‌తో(Brain stroke) అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మిత్రుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న పదో తరగతి వరకు కలిసి చదువుకున్న 2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మానవత్వంతో స్పందించారు. తమ స్నేహితుడి కుటుంబానికి ₹45,000 ఆర్థిక సాయం అందించి ఆపన్నహస్తం అందించారు.

భర్తను కోల్పోయిన భార్య, చిన్నారులు, వృద్ధ తల్లికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు.. ఆ కుటుంబానికి భవిష్యత్తులోనూ తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మిత్రుడితో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటూ, కష్టకాలంలో కుటుంబానికి తోడుగా నిలవడం పలువురి ప్రశంసలు అందుకుంది.

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

ఉమర్ పాషా కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించాలని పూర్వ విద్యార్థులు కోరారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, పిల్లల చదువుకు హాస్టల్ వసతి కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు