నో వోల్టేజ్ నివారణకు కెపాసిటర్ ఏర్పాటు

11-10-2026 | 04:14pm

బోథ్, అక్టోబర్ 11 ( విజయక్రాంతి): తరచుగా విద్యుత్ హెచ్చుతగ్గుల(Power surges) మూలంగా విద్యుత్ సరఫరా(Power supply) లో అంతరాయం కలుగుతుండడంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పాట్నాపూర్ లీడర్ లో ఈ సమస్య అధికంగా ఉంది. విద్యుత్తు మోటార్లకు అనుగుణంగా కెపాసిటర్ లేకపోవడంతో ఇటీవల కొంతమంది రైతులకు సంబంధించిన విద్యుత్ మోటార్లు కాలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

విషయాన్ని కొంతమంది రైతులు సంబంధిత విద్యుత్ శాఖ(Electricity Department) అధికారులకు తెలపడంతో విద్యుత్ కెపాసిటర్(electrical capacitor) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆదివారం పాట్నాపూర్ కు సంబంధించిన ఫీడర్లో కెపాసిటర్ బిగిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులకు ఇబ్బందులు తొలగిపోయేఆస్కారం ఉంది.

మరిన్ని వార్తలు