మరిగమ్మ జాతర శోభ.. భక్తులతో ఆలయం కళకళ
11-10-2026 | 04:10pm
బోధన్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): కల్దుర్కిలోని మరిగమ్మ ఆలయంలో 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి జాగరణ, భజన కార్యక్రమం(Bhajan Programme) చేపట్టగా, సోమవారం అన్నదాన కార్యక్రమం(Annadanam) నిర్వహించనున్నారు.
మరిగమ్మ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, వార్డు సభ్యుడు చంద్రకాంత్, వీడీసీ చైర్మన్ గంగాధర్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.