సేవలకు సత్కారం.. పదవీ విరమణ ఉద్యోగులకు గౌరవం

11-10-2026 | 03:36pm

నిర్మల్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్‌లో పద్మశాలి సంఘం(Padmashali Association) ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా సన్మానం(Honour Ceremony) నిర్వహించారు. సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాంబారి చంద్రమోహన్‌తో పాటు ఇతర ఉద్యోగులను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆడెపు సుధాకర్, ప్రధాన కార్యదర్శి జల్ద రాజేశ్వర్, గౌరవ అధ్యక్షుడు మిట్టపల్లి నరసయ్య, పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బూర ఉమాశంకర్, ఇతర సంఘ సభ్యులు, కులబాంధవులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వార్తలు