డ్రగ్స్, క్రమశిక్షణ, విద్యపై అవగాహనా

01-10-2026 | 09:42pm

గుండాల, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సీయల్ పాఠశాలలో(Ekalavya Model Residential School) స్థానిక సీఐ తిరుపతి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రగ్స్, క్రమశిక్షణ, విద్య తదితర విషయాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..పాఠశాల లో క్రమశిక్షణ, సోదరభావం, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు.

విద్యార్థుల ఇతర విషయాల్లో కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని, గొడవల్లో తల దూర్చవద్దని. సిగరెట్, గుట్కా, మద్యం, మాదక ద్రవ్యాల వంటి వాటి జోలికి వెళ్ళొద్దని, అవి తమ భవిష్యత్ ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. టీచర్స్ కూడా లోకల్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకోవాలని, లోకల్ వాళ్ళతో సన్నిహితంగా మెలగాలని సూచించారు.

మరిన్ని వార్తలు