మహిళ అదృశ్యం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఓమహిళ అదృశ్యమైన(Woman Missing) సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్‌కు చెందిన పనినా కార్జీ (27) అనే మహిళ ఈనెల 23న ఉదయం ఇంటి నుండి భర్త పనికి వెళ్లిన అనంతరం కనిపించకుండా పోయింది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చి చూడగా ఆమె ఇంట్లో లేదు. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు.
మహిళ ఎత్తు సుమారు 5 అడుగులు 2 అంగుళాలు, తెల్లని ఛాయ, ఇంటి నుండి వెళ్లిన సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉందని, హిందీ, ఒడియా భాషలు మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌ను 8712662705, సెక్టర్ ఎస్సై 8712662184 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.