బి కాలనీ తండాలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

28-11-2026 | 03:08pm

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గోలియాతండా గ్రామపంచాయతీ పరిధి బి కాలనీ తండాలో శనివారం ఉదయం ఇల్లందు డీఎస్పీ యు. వెంకన్నబాబు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా 43 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక బొలెరో వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు (Documents) లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

అనంతరం ప్రజలకు సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల అవగాహన కల్పించారు. గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ గేమింగ్ వల్ల కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, గుండాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి, ఎస్సైలు తిరుపతి, సోమేశ్వర్, నాగుల్ మీరా, సారంగపాణి, ఇల్లందు సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు