ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ డీఎం’

28-11-2026 | 03:16pm

నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రయాణికుల సమస్యలు, సూచనలు, సలహాలు తెలుసుకునేందుకు నిర్మల్ ఆర్టీసీ డిపో (RTC Depot) పరిధిలో ఆదివారం ‘డయల్ యువర్ డీఎం’ (Dial Your DM) కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికులు బస్సుల రాకపోకల సమయాల్లో మార్పులు, అదనపు బస్సుల ఏర్పాటు, ఇతర సమస్యలు, సూచనలను 9959226003 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

ప్రయాణికుల అభిప్రాయాలను (Feedback) స్వీకరించి, వారి అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు (Services) అందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు డీఎం కల్పన వివరించారు.

మరిన్ని వార్తలు