మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు
నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను నిర్మల్లో బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో మహాత్మా జ్యోతిబాపూలేకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, మూఢనమ్మకాల (Superstitions) నిర్మూలనకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు జీవన్, నాయకులు రామకృష్ణ, రాము, శోభన్ తదితరులు పాల్గొన్నారు.