బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
నూగూరు, నవంబర్ 28 (విజయక్రాంతి): వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పోడెం సురేష్ తల్లి ఆదిలక్ష్మి అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుడవర్తి నర్సింహమూర్తి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఆమె కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక (Financial) సాయం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదిలక్ష్మి మృతి ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి (Condolences) తెలిపారు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీనియర్ నాయకులు మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ షోలం హోంపతి, మునిగేల ప్రసాద్, పొనగంటి కృష్ణారావు, గుమ్మేళ్ల పురుషోత్తం, షోలం సతీష్, పోడెం బాలరాజు, కొప్పుల మల్లయ్య పాస్టర్, బట్ట పురుషోత్తం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.