మహిళలకు స్వయం ఉపాధే లక్ష్యం

01-10-2026 | 08:09pm

సింగరేణి సేవాసమితి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు ప్రారంభం

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి సేవాసమితి(Singareni Seva Samithi) ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి నిర్వహించనున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు గురువారం స్థానిక వై.సి.ఓ.ఏ క్లబ్‌లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య, సేవా అధ్యక్షురాలు వి. రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సేవా అధ్యక్షురాలు వి. రమ రిబ్బన్ కట్ చేసి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం టైలరింగ్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం తదితర శిక్షణా విభాగాలను సందర్శించి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వి. రమ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు స్వయం ఉపాధి పొందేలా సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో పొందిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

శిక్షణకు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారం, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి. సుధాకర్, సేవా సెక్రటరీ సులక్షణ, ట్రిపుల్ ఎస్ కోఆర్డినేటర్ బి.సాంబయ్య, అధికారులు, ఉద్యోగులు, సేవాసమితి సభ్యులు, శిక్షకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు