నేషన్ బిల్డర్స్ అవార్డులతో ఉపాధ్యాయులకు సత్కారం
బూర్గంపాడు,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ భద్ర సారపాక(Rotary Club of Bhadra Sarapaka) ఆధ్వర్యంలో నేషన్ బిల్డర్స్ అవార్డ్స్(Nation Builders Awards) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులకు రోటరీ అవార్డులు(Rotary Awards) అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు కె.రాంబాబు, అధ్యక్షుడు కె.ఆర్.పి సింగ్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
క్రమశిక్షణ, నైపుణ్యం, జ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తమపై మరింత పెరిగిందన్నారు.కార్యక్రమంలో రోటరీ పూర్వ అధ్యక్షుడు జె.కె దాస్, కార్యదర్శి డేవిడ్ అలివర్,దుర్గాప్రసాద్,సాయిరాం, సూర్యప్రకాష్,ఫణి,తిరుపతిరావు, రోటరాక్టర్స్ మయాంక్, సంగీతతో పాటు గుత్తేదారులు బి.రమేష్, మహేష్‌రెడ్డి, యాకూబ్, యోసోబు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.