అశ్వాపురం రైతులకు నీళ్లేవీ?

25-10-2026 | 05:20pm

అశ్వాపురం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టుకు(Sitarama Project) భూములిచ్చిన అశ్వాపురం రైతులకు(Ashvapuram farmers) సాగునీరు అందించకపోవడం అన్యాయమని  ఆదివారం బీఆర్‌ఎస్ నేతలు భూక్యా చందూలాల్(BRS leaders Bhukya Chandulal), కోడి అమరేందర్ విమర్శించారు. మంత్రుల ప్రాంతాలకు గోదావరి జలాలు(Godavari waters) తరలిస్తూ అశ్వాపురంపై సవతి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మౌనం వీడి, తుమ్మలచెరువుతో పాటు మండలంలోని అన్ని చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీతమ్మ బ్యారేజ్ పనులపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు