డెట్టాల్ నుంచి ఒరిజినల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్
న్యూఢిల్లీ: చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులను ప్రోత్సహించి మరియు అభివృద్ధి చేయడంలో మార్గదర్శకత్వంవహించే డెట్టాల్, కొత్త డెట్టాల్ ఒరిజినల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్(New Original Foaming Handwash)ను విడుదల చేసిందని ఈరోజు ప్రకటించింది. దశాబ్దాలుగా, డెట్టాల్ భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానం ఆధారమైన ఆవిష్కరణ మరియు నమ్మకమైన క్రిముల రక్షణ ద్వారా భారతదేశంలో చేతి పరిశుభ్రత అలవాట్లను తీర్చిదిద్దడంలో సహాయపడింది. డెట్టాల్ యొక్క దిగ్గజపు ఒరిజినల్ హ్యాండ్ వాష్ ఇప్పుడు ఆధునిక ఫోమింగ్ రూపంలో లభిస్తోంది.
ఇది డెట్టాల్ యొక్క ఒరిజినల్ సిగ్నేచర్ పరిమళాన్ని డెట్టాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ శ్రేణికి తీసుకువస్తోంది. చేతులు శుభ్రం చేసుకునే చైతన్యం కాలక్రమేణా గణనీయంగా పెరిగిన కారణంగా, ప్రభావవంతంగా చేతులు శుభ్రం చేయడం ఒక సవాలుగా మిగిలింది. చేతులు శుభ్రం చేసిన తరువాత కూడా తమ పిల్లల చేతులు పూర్తిగా శుభ్రం కాలేదని ముఖ్యంగా పిల్లలు పూర్తి చేయి అంతా ప్రభావవంతంగా వ్యాపించడానికి చేతులను కావలసినంత సేపు రుద్దుకోరని భారతదేశంలో అమ్మలు తరచు విచారిస్తుంటారు. వినియోగదారుల యొక్క ఈ అభిప్రాయాన్ని మరియు ప్రవర్తనా అంతరాన్ని గుర్తించి డెట్టాల్ ఒరిజినల్, భారతదేశపు నంబర్ 1 హ్యాండ్ వాష్, ఇప్పుడు చేయి యొక్క ప్రతి మూలలకు వ్యాపించి సాధారణ లిక్విడ్ హ్యాండ్ వాష్ తో పోల్చినప్పుడు 10 రెట్లు మెరుగ్గా క్రిముల నుండి రక్షణను ఇచ్చే ఫోమింగ్ ఫార్మాట్ ను తెచ్చింది.
రోజూవారీ వినియోగదారుల కోసం ఉన్నతమైన క్రిముల రక్షణను సులభం, మరింత సౌకర్యవంతం మరియు ప్రభావవంతంగా చేయడానికి, ఈ విడుదల ప్రజల ఆరోగ్యం & పరిశుభ్రత కోసం అర్థవంతమైన ఆవిష్కరణను ప్రోత్సహించడంలో డెట్టాల్ యొక్క నాయకత్వాన్ని మరింత బలవర్థకం చేస్తూనే మరింత ఎక్కువమంది ప్రజలను, ఎక్కువ సమాజాలను చేరుకోవడంలో డెట్టాల్ యొక్క నిబద్ధతను అభివృద్ధి చేస్తోంది.
ఈ విడుదల గురించి గుంటాస్ ముద్గల్, రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్- హెల్త్, దక్షిణాసియా, రెకిట్ మాట్లాడుతూ, తరతరాలుగా కుటుంబాలు నమ్మకమైన క్రిముల రక్షణ కోసం డెట్టాల్ ఒరిజినల్ పై ఆధారపడ్డారు. అయితే, చేతులను శుభ్రం చేయడంలో ముఖ్యంగా పిల్లలు సంపూర్ణంగా చేయకపోతే ప్రభావవంతమైన చేతుల శుభ్రతకు కీలకమైన అడ్డంకిగా నిలుస్తుందని తాము గుర్తించామన్నారు. మా దిగ్గజపు ఒరిజినల్ వేరియెంట్ ను ఆధునిక ఫోమింగ్ రూపంలో తీసుకురావడం ద్వారా, మేము ఉన్నతమైన క్రిముల రక్షణను సులభం చేస్తున్నాము మరియు రోజూవారీ జీవితంలో మరింత అందుబాటులో ఉంచుతున్నామన్నారు.