పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే..
నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణి(Alias Rukmini)’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను దీప్తి గంట నిర్మిస్తున్నారు. రొమాన్స్, హ్యూమర్ కలగలిసిన ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ కథానాయిక కాగా సాయికుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘రుక్మిణి’కి మంచి స్పందన నేపథ్యంలో తాజాగా మేకర్స్ రెండో పాట ‘పిచ్చి ప్రేమలో’ను రిలీజ్ చేశారు.
‘పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే ఓ వగలాడి.. నచ్చే లెక్కలో నన్నే మించుతావే.. చందమామలా మచ్చ కూడ లేదే ఓ ప్రియురాలా.. ఎంత చెప్పినా ఇంకా తక్కువేలే..’ అంటూ సాగుతోందీ గీతం. లీడ్ పెయిర్ నితిన్, ఆఫియా సయ్యద్ మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపర్చిన ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, కార్తీక్ పాడారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు డీవోపీ: జోమోన్ టీ జాన్ ఐఎస్సీ; సంగీతం: విజయ్ బుల్గానిన్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: సృజన ఆదుసుమిల్లి.